ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Canada: భారత్, కెనడా వివాదంలో కీలక పరిణామం.. 40 మంది దౌత్యవేత్తలను తొలగించాలని అల్టిమేటం జారీ

ABN, First Publish Date - 2023-10-03T13:00:58+05:30

భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంలో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. భారత్‌లోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశానికి కేంద్రం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.

ఢిల్లీ: భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంలో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. భారత్‌లోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశానికి కేంద్రం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తల్లో 40 మందిని ఉపసంహరించుకోవాలని ఆ దేశానికి కేంద్రం తెలిపిందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రక్రియను అక్టోబర్ 10లోగా పూర్తి చేయాలని గడువు విధించిందంట. ఆ తర్వాత కూడా భారత్‌లో అధిక సంఖ్యలో కెనడా దౌత్య సిబ్బంది ఉంటే వారికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని హెచ్చరించినట్లు సదరు కథనంలో ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఢిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్య సిబ్బంది ఉన్నారు. వారిలో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఇటు భారత్ నుంచి కానీ, అటు కెనడా నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


కాగా దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని గతంలోనూ కెనడాకు భారత్ సూచించింది. ఇటీవల ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఢిల్లోని కెనడా దౌత్యవేత్తల సంఖ్య అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్య సిబ్బందిదో పోలిస్తే ఢిల్లీలోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఆ సమయంలోనే దానిని సమాన స్థాయికి తీసుకురావాలని కెనడాకు భారత్ స్పష్టం చేసింది. కాగా ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఇప్పటివరకు అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెనడా ప్రధాని ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని భారత దౌత్యవేత్తపై నిషేధం విధించగా.. భారత్ కూడా ఢిల్లోనీ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఆ తర్వాత కెనడా వాసులకు భారత్ వీసాలను కూడా నిలిపివేసింది. తాజాగా ఢిల్లీలోని దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కెనడాకు అల్టిమేటం జారీ చేసింది. భవిష్యత్‌లో ఈ వివాదం ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. మరోవైపు ఈ వివాదంలో ప్రపంచదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.

Updated Date - 2023-10-03T13:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising