ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains: అకాల వర్షాలకు తోడు పిడుగులు పడి 20 మంది మృతి

ABN, First Publish Date - 2023-11-27T10:04:07+05:30

వారాంతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేక చోట్ల పిడుగులు పడడంతో ఏకంగా 20 మంది చనిపోయారు. వడగళ్లతో కూడిన వర్షాలకు తోడు పిడుగులు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది చనిపోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) వెల్లడించింది.

అహ్మదాబాద్: వారాంతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేక చోట్ల పిడుగులు పడడంతో ఏకంగా 20 మంది చనిపోయారు. వడగళ్లతో కూడిన వర్షాలకు తోడు పిడుగులు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది చనిపోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) వెల్లడించింది. ఆదివారం గుజరాత్‌లో భారీ వర్షాలు కురిశాయని, అనేక చోట్ల పిడుగులు పడ్డాయని పేర్కొంది. ఈ క్రమంలో మృతుల వివరాలను స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జిల్లాల వారీగా విడుదల చేసింది. ఎస్‌ఈఓసీ తెలిపిన వివరాల ప్రకారం దాహోద్‌లో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంత, బోటాడ్, ఖేడా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్రనగర్‌, దేవభూమి ద్వారక జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.


ఈ విషాదకర ప్రాణ నష్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన సంతాపాన్ని తెలిపారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలలో చురుకుగా నిమగ్నమై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. "గుజరాత్‌లోని వివిధ నగరాల్లో చెడు వాతావరణం, పిడుగుల కారణంగా చాలా మంది మరణించారనే వార్త నాకు బాధ కలిగించింది. ఈ విషాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక పరిపాలన యంత్రాంగం సహాయక పనుల్లో నిమగ్నమై ఉంది" అని తెలిపారు. ఎస్‌ఈఓసీ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌లోని సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా సోమవారం నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

Updated Date - 2023-11-27T10:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising