ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబు బయటికి రాగానే టీడీపీలో చేరతా: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-09-18T16:49:28+05:30

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటికి రాగానే అధికారికంగా టీడీపీలో చేరతానని వైసీపీ రెబల్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.

నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటికి రాగానే అధికారికంగా టీడీపీలో చేరతానని వైసీపీ రెబల్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఉదయగిరి టీడీపీ టికెట్ ఇస్తే మరోసారి ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా ఎప్పటికీ టీడీపీలోనే కొనసాగి పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని చెప్పారు. అలాగే చంద్రబాబుకు వెంటనే బెయిల్ రావాలని, జైలు నుంచి విడుదల కావాలని వినాయకుడికి మొక్కుకున్నట్టు ఆయన తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. వైకాపా తనను సస్పెండ్‌ చేసిందని చెప్పారు. త్వరలోనే టీడీపలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు.


చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఇప్పటికే పార్టీలో చేరేవాడినని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన గ్రాఫ్‌ బాగాలేదని సీఎం చెప్పారని తెలిపారు. అలాగే ఉదయగిరిలో తాను తప్ప ఎవరూ గెలవరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేశారని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం వైసీపీకి, జగన్ రెడ్డికే నష్టమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా చంద్రబాబు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుతూ మర్రిపాడులోని తన నివాసంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వినాయకుడికి పూజలు చేశారు. వినాయకుడికి 37 వేల లడ్డూలను నైవేద్యంగా పెట్టారు. పూజల అనంతరం ఆత్మకూరు నియోజకవర్గంలోని వినాయక మండపాలకు ఆయన లడ్డూలను పంపిణీ చేశారు.

Updated Date - 2023-09-18T19:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising