ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పోలవరంలో కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ నేతల నిరసన

ABN, First Publish Date - 2023-02-18T14:07:59+05:30

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పోలీసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం: తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) అనపర్తి (Anaparthy) లో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu) పర్యటనకు పోలీసులు (AP Police) అడ్డంకులు సృష్టించడంపై పోలవరంలో టీడీపీ నేతలు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలవరం మండల కేంద్రంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu), మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కులను కాపాడాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ (Dr. BR Ambedkar) విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఆపై కళ్ళకు గంతలు కట్టుకుని కళ్ళు ఉండి చూడలేనీ ఈ అరాచక, సైకో పాలన పోవాలని టీడీపీ నేతలు నినాదాలు చేశారు.

కాగా.. తూర్పుగోదావరి జిల్లాలో ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో పాల్గొనటానికి చంద్రబాబు నాయుడు (TDP Chief) అన్ని రకాల అనుమతులు తీసుకుని అనపర్తి నియోజకవర్గం (Anaparthi Constituency) పర్యటనకు వెళ్లగా... తాడేపల్లి (Tadepalli) లో ఉన్న సైకో జగన్ (YS Jaganmohan Reddy) ఆదేశాలతో అనుమతి ఇచ్చిన పోలీసులే అనుమతి లేదంటూ పలు విధాలుగా అడ్డుకున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రశ్నించగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. రోడ్లపై పోలీసులు వాహనాలు నిలిపివేయడంతో చంద్రబాబు కాలినడకన ఏడు కిలోమటర్ల మేర నడిచి అనపర్తికి చేరుకున్నారు. ఈ మధ్యలో పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించేందుకు యత్నించి విఫలమయ్యారు. చివరకు అనపర్తి చేరుకుని చంద్రబాబు సభలో మాట్లాడుతున్న సమయంలో కూడా కరెంట్ తిసేయటం, జనరేటర్ ఆపేయటం ఇలా ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాలరాశారు. ఇందుకు నిరసనగా పోలవరంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు.

Updated Date - 2023-02-18T14:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising