Sreedhar: ఆ విషయం చంద్రబాబు వైసీపీ నేతలకు చెప్పారా..?
ABN, Publish Date - Dec 31 , 2023 | 06:22 PM
పెదకూరపాడు సీటు తనకు ఇవ్వడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) చెప్పలేదని, వైసీపీ ( YCP ) నేతలకు ఏమైనా చెప్పారా అని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ( Kommalapati Sreedhar ) ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా: పెదకూరపాడు సీటు తనకు ఇవ్వడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) చెప్పలేదని, వైసీపీ ( YCP ) నేతలకు ఏమైనా చెప్పారా అని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ( Kommalapati Sreedhar ) ప్రశ్నించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెదకూరపాడు టీడీపీ సీటుపై కావాలనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అన్ని సీట్లపై అధ్యయనం చేసి చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే శంకరరావు ఓడిపోతాననే భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి శంకర్రావు సీటుని మారుస్తారేమో మొదట చూడాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పెదకూరపాడులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా బారికేడ్లు దూకి టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు.
Updated Date - Dec 31 , 2023 | 06:22 PM