చేతిలో కర్ర ఉంటే జంతువులు దాడి చేయడానికి జంకుతాయని శాస్త్రీయంగా రుజువైంది: కరుణాకర్ రెడ్డి
ABN, First Publish Date - 2023-09-06T19:35:21+05:30
చేతిలో కర్ర ఉంటే జంతువులు దాడి చేయడానికి జంకుతాయని శాస్త్రీయంగా రుజువైందని టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తిరుపతి: చేతిలో కర్ర ఉంటే జంతువులు దాడి చేయడానికి జంకుతాయని శాస్త్రీయంగా రుజువైందని టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలకు నడక దారిలో నడిచి వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీని టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చేతి కర్రలు ఇవ్వడాన్ని పని కట్టుకుని విమర్శించే వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. చేతి కర్ర భక్తుల్లో ఆత్మ విశ్వాసం నింపుతుందని చెప్పారు. తిరుమలకు వెళ్ళిన తర్వాత చేతి కర్ర వారి నుంచి తీసుకుని తిరిగి ఇతర భక్తులకు ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నామని, రక్షకులు కూడా భక్తులతోనే ఉంటారని కరుణాకర్ రెడ్డి చెప్పారు. కాగా ఇటీవల తిరుమలకు నడక దారిలో వెళ్తున్న నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారి లక్షిత చనిపోయింది. దీంతో నడిచి వేళ్లే భక్తులకు రక్షణగా చేతి కర్రలు అందించాలని టీటీడీ నిర్ణయించింది.
Updated Date - 2023-09-06T19:35:43+05:30 IST