Zohran Mamdani Takes Oath: న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణం
ABN, Publish Date - Jan 02 , 2026 | 03:59 AM
ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్న కొన్ని క్షణాల్లోనే న్యూయా ర్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ జనవరి ఒకటో తేదీన...
తొలి భారతీయ ముస్లింగా రికార్డు
న్యూయార్క్, జనవరి 1: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్న కొన్ని క్షణాల్లోనే న్యూయా ర్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ జనవరి ఒకటో తేదీన (బుధవారం అర్థరాత్రి) ప్రమాణ స్వీకారం చేశారు. మాన్‌హట్టన్‌లోని చారిత్రాత్మక సబ్‌వే స్టేషన్‌లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీతో న్యూయార్క్ అటార్నీ జనరల్ లెతెతీయా జేమ్స్ ప్రమాణం చేయించారు. న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణం చేసిన తొలి ముస్లిం కావడం గమనార్హం. భార్య రమా దువాజీ పట్టుకున్న ఖురాన్‌పై ప్రమాణం చేసిన మమ్దానీ.. తన జీవితానికి దక్కిన ఈ గౌరవం ఎంతో ప్రత్యేకమైందన్నారు.
Updated Date - Jan 02 , 2026 | 03:59 AM