ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Iran Amid Economic Crisis: అట్టుడుకుతున్న ఇరాన్‌!

ABN, Publish Date - Jan 02 , 2026 | 04:03 AM

కరెన్సీ దారుణ పతనం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి....

  • దేశవ్యాప్తంగా రోడ్లపైకి ఆందోళనకారులు

టెహ్రాన్‌, జనవరి 1: కరెన్సీ దారుణ పతనం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. బుధవారం వరకు టెహ్రాన్‌, ఇతర పట్టణ ప్రాంతాల్లోనే నిరసనలు జరగగా, గురువారం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. ఆందోళనకారులకు, వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా బలగాలకు తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. గురువారం లోర్డెగన్‌, కుష్దస్త్‌, ఇస్ఫహాన్‌ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు మరణించా రు. మృతుల సంఖ్య భారీగానే ఉందని, ఆందోళనల అంశాన్ని ప్రభుత్వం తొక్కిపెడుతోందని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక గురువారం నిరసనకారులు ఫసా నగరంలోని గవర్నర్‌ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో.. ఒక పోలీసు మృతిచెందగా, మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - Jan 02 , 2026 | 04:03 AM