Fire Tragedy: స్విట్జర్లాండ్ బార్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN, Publish Date - Jan 02 , 2026 | 04:10 AM
స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆల్ప్స్ పర్వతాల్లో పర్యాటకులకు స్వర్గధామంలాంటి క్రాన్స్-మోంటానాలో...
40 మంది మృతి.. 115 మందికిపైగా గాయాలు
కొత్త సంవత్సరం వేళ విషాదం
క్రాన్స్-మోంటానా (స్విట్జర్లాండ్), జనవరి 1: స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆల్ప్స్ పర్వతాల్లో పర్యాటకులకు స్వర్గధామంలాంటి క్రాన్స్-మోంటానాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 40 మంది వరకు మరణించారు. 115 మందికి పైగా గాయపడ్డారు. రాత్రి 1.30 గంటల సమయంలో ప్రఖ్యాత లీ కాన్‌స్టిలేషన్ బార్‌లో వందలమంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు భారీ పేలుడు శ బ్దం వినిపించిందని స్థానికులు చెబుతుండగా, బార్‌లో ఓ వెయిటర్ షాంపేన్ బాటిల్ మూత భాగంలో స్పార్క్ (మెరుపులాంటి మంట)ను అంటించుకొని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు సీలింగ్‌కు మంట అంటుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే నిర్ధారించలేమని వలైస్ కాంటన్ పోలీస్ కమాండర్ ఫ్రెడరిక్ గిస్లర్ గురువారం తెలిపారు.
Updated Date - Jan 02 , 2026 | 05:28 AM