ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Most Searched Words 2025: ఈ ఏడాది జనాలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు

ABN, Publish Date - Dec 21 , 2025 | 10:42 PM

ఈ ఏడాది ముగింపునకు వచ్చిన నేపథ్యంలో జనాలు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ టెన్ పదాలు ఏవో తెలుసుకుందాం పదండి.

Most Searched Words in Google-2025

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే. అందుకే, జనాలు తమకు ఆసక్తి కలిగిన అంశాల గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తారు. మరి ఈ ఏడాది ముగింపునకు వచ్చిన నేపథ్యంలో జనాలు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం (Year Ender 2025- Most Searched Words in Google).

1.జెమినై

ఇది ఏఐ జమానా. నిత్య జీవితంలో ఏఐ ఓ భాగం అయిపోతున్న పరిస్థితి. పలు టెక్ సంస్థలు తమ ఏఐ ఉత్పత్తులను రంగంలోకి దించుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాలు ఈ ఏడాది గూగుల్‌కు చెందిన జెమినై చాట్‌బాట్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు. జెమినై ఫీచర్లు, అప్‌డేట్స్, రోజువారి దీన్ని ఎలా వాడుకోవచ్చు అనే విషయాల కోసం సెర్చ్ చేశారు.

2.ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ కూడా భారతీయులను అమితంగా ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఈ మ్యాచులను అత్యంత శ్రద్ధగా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు గూగుల్‌లో మ్యాచ్‌ల సమాచారాన్ని తెలుసుకున్నారు. దీంతో, ఇది ఈ ఏడాది సెర్చ్‌ల్లో రెండో స్థానంలో నిలిచింది.

3.చార్లీ కిర్క్ హత్య

ప్రపంచవ్యాప్తంగా జనాల్ని షాక్‌కు గురి చేసిన అంశం చార్లీ కిర్క్ హత్య. ట్రంప్‌కు మంచి మిత్రుడిగా పేరున్న కిర్క్ హత్యకు గురికావడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అతడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుుకు ప్రయత్నించడంతో ఈ పదం మూడో స్థానంలో నిలిచింది.

4.క్లబ్ వరల్డ్ కప్

ఈ ఏడాది ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకర్షించిన అంశం ఫీఫా క్లబ్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్. ఈ టోర్నీల్లో ఆడే టీమ్స్, మ్యాచ్ ఫలితాలు, టోర్నీ అప్‌డేట్స్ కోసం జనాలు నెట్టింట దీని కోసం తెగ వెతికేశారు.

5.ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

క్రికెట్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకున్న మరో టోర్నీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఈ టోర్నీపై ఆసక్తి కనబరచడంతో ఇది ఈ ఏటి టాప్ సెర్చ్ పదాల్లో 5 స్థానంలో నిలిచింది.

6.డీప్ సీక్

ఏఐలో పాశ్చాత్య దేశాలదే హవా అని అనుకుంటున్న తరుణంలో చైనా సంస్థ రూపొందించిన డీప్‌సీక్ కూడా జనాలను బాగా ఆకర్షించింది. అతి తక్కువ ఖర్చుతో అద్భుత సామర్థ్యాలు కనబరిచిందన్న పేరు రావడంతో జనాలు డీప్ సీక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికేశారు. ఈ ఏడాది ఈ పదం నెం.6 స్థానాన్ని ఆక్రమించింది.

7.ఆసియా కప్

క్రికెట్ అభిమానులను ఈ ఏడాది ఆసియా కప్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. దీంతో, ఈ ఏడాది టాప్ సెర్చ్ పదాల్లో ఇది నెం.7గా నిలిచింది.

8.ఇరాన్

టాప్ టెన్ సెర్చ్ పదాల్లో నెం.8గా ఇరాన్ నిలిచింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరడంతో జనాలు అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు నెట్టింట సమాచారాన్ని తెగ జల్లెడ పట్టేశారు. ఇరాన్ పదాన్ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు.

9.ఐఫోన్ 17

టెక్ ప్రపంచంలో ఐఫోన్ 17 ఓ సంచలనం అని చెప్పకతప్పదు. ఈ కొత్త మోడల్ గురించి తెలుసుకునేందుకు జనాలు అమితాసక్తిని కనబరిచారు. ముఖ్యంగా ఫోన్ రిలీజ్‌కు ముందు జనాల్లో ఆసక్తి పతాక స్థాయికి చేరింది. దీంతో, ఐఫోన్ 17 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

10.పాకిస్థాన్ అండ్ ఇండియా

క్రికెట్ మ్యాచ్‌లు, దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా జనాలు భారత్, పాక్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. దీంతో, ఈ రెండూ నెం.10 స్థానంలో నిలిచాయి.

ఇవీ చదవండి

క్రైమ్ ఇయర్‌గా 2025.. జనాన్ని భయపెట్టిన మర్డర్ కేసులు ఇవే..

700 బిలియన్ డాలర్ల పైచిలుకు సంపద.. ఎలాన్ మస్క్ మరో రికార్డు

Updated Date - Dec 22 , 2025 | 07:03 AM