Actor Darshan Bail: కన్నడ హీరో దర్శన్ బెయిల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
ABN, Publish Date - Jul 24 , 2025 | 05:01 PM
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్‌కు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు రేణుకా స్వామి హత్య కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయ అధికారం దుర్వినియోగం అయిందని వ్యాఖ్యనించింది. హైకోర్టు చేసిన తప్పును తాము పునరావృతం చేయమని.. దోషిగా, నిర్దోషిగా ప్రకటించేందుకు తాము ఎలాంటి తీర్పును ఇప్పుడే ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్‌కు తగిన ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చిన తీర్పు కాపీలో హైకోర్టు పేర్కొన్న భాషపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది.
Updated Date - Aug 06 , 2025 | 12:43 PM