Pak PM Shehbaz Sharif: భారత్ మిస్సైల్స్ దాడి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని
ABN, Publish Date - May 17 , 2025 | 01:57 PM
Operation Sindoor: భారత్ దాడిలో కీలక ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌పై భారత్ మిస్సైల్స్ దాడి నిజమేనని ఆయన స్వయంగా చెప్పారు. తాజాగా జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
పాక్ అధికారులకు, ప్రజలకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఊహించని షాక్ ఇచ్చారు. తమపై భారత్ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు జరగలేదని పాక్ ఇన్నిరోజులు ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం అంతా ఒట్టిదేనని పాక్ ప్రధాని చెప్పకనే చెప్పారు. భారత్ దాడిలో కీలక ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ప్రకటించారు. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌పై భారత్ మిస్సైల్స్ దాడి నిజమేనని ఆయన స్వయంగా చెప్పారు. తాజాగా జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ మే 10వ తేదీ తెల్లవారుజామున జనరల్ అసిఫ్ మునిర్ నాకు ఫోన్ చేశారు. భారత్ మిస్సైల్స్ దాడి చేసిందని అన్నారు. ఓ మిస్సైల్ నూర్ ఖాన్ ఏయిర్‌బేస్‌పై పడిందని.. వేరే ప్రాంతాల్లో కూడా మిస్సైల్స్ పేలాయని చెప్పారు’ అని అన్నారు
Updated Date - May 17 , 2025 | 01:57 PM