Heavy Rains: హైదరాబాద్లో భారీ వర్షం .. నదులను తలపిస్తున్న రోడ్లు
ABN, Publish Date - May 24 , 2025 | 09:45 PM
Hyderabad News: కవాడి గూడ, సికింద్రాబాద్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నదులను తలపించాయి.
హైదరాబాద్‌లో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కవాడి గూడ, సికింద్రాబాద్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నదులను తలపించాయి. ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది. ఇక, తెలంగాణలో రానున్న ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మిస్‌వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు భారతీయులు వీరే
Updated Date - May 24 , 2025 | 09:52 PM