ప్రియుడు మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:11 PM
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు తనను మోసం చేశాడని బలవన్మరణానికి పాల్పడింది. ప్రియుడి ఇంటి ముందే..
చిత్తూరు: మార్వాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతి.. ప్రొద్దుటూరులోనే ఫైనాన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న వాసుని ప్రేమించింది. అయితే, తనకు పెళ్లి కాలేదని చెప్పి వాసు మోసం చేసిన విషయం తెలుసుకున్న ప్రశాంతిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రియుడు వాసు ఇంటిముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ప్రశాంతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 70 శాతానికి పైగా కాలినగాయాలతో తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రశాంతి చికిత్స పొందుతుంది.
Updated Date - Jul 25 , 2025 | 04:12 PM