యోగాను ప్రజా ఉద్యమంగా చేస్తా.. జగన్‌కు బాబు కౌంటర్
ABN, Publish Date - Dec 20 , 2025 | 05:50 PM
యోగా పరంగా భారతదేశానికి ఎంతో గుర్తింపు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపడతామని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో విశాఖపట్నం కేంద్రంగా యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు అన్నారు. యోగా అనేది మన భారతీయ సంపద అని, సంస్కృతిలో భాగమని ఆయన చెప్పారు. నేడు 150 దేశాలు.. యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయంటే.. ప్రపంచ మొత్తం మనల్ని ఫాలో అవుతోందంటే అది ప్రధాని నరేంద్రమోదీ తీసుకువచ్చిన గుర్తింపేనని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో యోగాను ప్రజా ఉద్యమంగా చేస్తానని.. ఈ సందర్భంగా మాజీ సీఎంకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు.
Updated Date - Dec 20 , 2025 | 05:59 PM