Windows 10 Support Ends: విండోస్ 10 సపోర్ట్ క్లోజ్..మీ పీసీ భవిష్యత్తేంటి?
ABN, Publish Date - Sep 15 , 2025 | 01:46 PM
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 యూజర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. అక్టోబర్ 14, 2025 తర్వాత దీని సపోర్ట్ పూర్తిగా ముగుస్తోంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఎలా అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం.
మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి అక్టోబర్ 14, 2025 తర్వాత సపోర్ట్ పూర్తిగా నిలిపివేస్తుంది. ఇది 2015లో విడుదలైన ఈ ఓపరేటింగ్ సిస్టమ్ 10కి సంవత్సరాల పాటు అందించిన మద్దతు ముగింపు అని చెప్పవచ్చు (Windows 10 Support Ends). ఇకపై సెక్యూరిటీ, ఫీచర్, టెక్నికల్ సపోర్ట్ ఏమీ ఉండవు. మీ కంప్యూటర్ పని చేస్తూనే ఉంటుంది. కానీ సైబర్ దాడులు, వైరస్‌ల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది.
కానీ మైక్రోసాఫ్ట్ ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ (ESU) ప్రోగ్రామ్‌తో దీనిని వినియోగించుకోవచ్చు. మొదటి సంవత్సరానికి $61 (సుమారు రూ.5,000) చెల్లించి సెక్యూరిటీ పొందవచ్చు. మూడేళ్లకు $427 (సుమారు రూ.36,000) అవుతుంది.
Updated Date - Sep 15 , 2025 | 01:52 PM