ఘరానా మోసం.. రూ.3 కోట్లు స్వాహా..
ABN, Publish Date - Dec 05 , 2025 | 10:01 AM
ఉప్పల్ పీఎస్ పరిధి కుమ్మరికుంటలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో రూ.3కోట్లు వసూలు చేసిన దంపతులు పరారయ్యారు. ఆ ప్రాంతంలో వారు పదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు.
హైదరాబాద్: ఉప్పల్ పీఎస్ పరిధి కుమ్మరికుంటలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో రూ.3కోట్లు వసూలు చేసిన దంపతులు పరారయ్యారు. ఆ ప్రాంతంలో వారు పదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకుని అధిక వడ్డీల ఆశ చూపారు నిందితులు. చిట్టీల పేరుతో స్థానికుల నుంచి ఏకంగా రూ.3కోట్లు వసూలు చేశారు. అద్దె ఇంటికి తాళం వేసి ఫోన్లు స్విచ్ఛాప్ చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.
Updated Date - Dec 05 , 2025 | 10:01 AM