కడపలో మహానాడు సంబరాలు..
ABN, Publish Date - May 26 , 2025 | 02:10 PM
TDP Mahanadu: టీడీపీ మహానాడు నిర్వహణకు కడపలో సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు పెద్ద పీఠ వేయడంతోపాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది.
కడప: టీడీపీ మహానాడు (TDP Mahanadu) నిర్వహణకు కడప (Kadapa)లో సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు పెద్ద పీఠ వేయడంతోపాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలిరోజు (మంగళవారం) పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతోపాటు టీడీపీ మౌళిక సిద్ధాంతాలు, మంత్రి లోకేష్ ప్రతిపాదించిన ఆరు సూత్రాల (Minister Lokesh six principles) ఆవిష్కరణ.. పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
Also Read: కలకలం రేపుతున్న గుర్రాల మరణాలు
పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మంగళవారం ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వాలన చేసి.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
టెక్నికల్ ప్రొబ్లామ్.. ఆలస్యంగా EAPCET పరీక్ష
దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్‌వర్క్
For More AP News and Telugu News
Updated Date - May 26 , 2025 | 02:11 PM