భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్..
ABN, Publish Date - Aug 05 , 2025 | 08:02 AM
మంగళవారం 13 జిల్లాలు, బుధవారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rain Alert) కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇవాళ(మంగళవారం) 13 జిల్లాలు, బుధవారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) ప్రకటించింది. సోమవారం నాడు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Kaleshwaram Project: కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే!
Updated Date - Aug 05 , 2025 | 08:08 AM