అమ్మవారు పిలుస్తోంది.. జీవసమాధికి యత్నం
ABN, First Publish Date - 2025-03-31T12:02:00+05:30
Jiva Samadhi Attempt: ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి జీవ సమాధికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు కలలో భూదేవత కనిపిస్తోందని.. కోటి రెడ్డి అనే వ్యక్తి జీవసమాధికి యత్నించాడు.
ప్రకాశం, మార్చి 31: జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి జీవ సమాధి (Jiva Samadhi) అవడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కోటి రెడ్డి అనే వ్యక్తి నిన్న(ఆదివారం) జీవసమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. భూదేవి అనే అమ్మవారు తన ఒంట్లోకి వస్తోందని కోటి రెడ్డి 30 లక్షలతో గుడిని నిర్మించాడు. ఉగాది రోజున జీవ సమాధి అవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని బయటకు తీశారు. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలోని సొంత భూమిలో కోటి రెడ్డి అనే వ్యక్తి ఐదు అడుగుల లోతున గుంట తీసుకుని జీవసమాధి అవుతున్నానంటూ గ్రామస్తులందరికీ తెలియజేశారు. దీన్ని చూసేందుకు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆ ఘటనా స్థలికి చేరుకున్నారు.
గతంలో కోటిరెడ్డికి భూదేవత తనకు కలలోకి వస్తుందంటూ గ్రామంలో రూ.30 లక్షలు ఖర్చుపెట్టి గుడిని నిర్మించారు. ఈ నేపథ్యంలో జీవసమాధి అవుతున్నానంటూ ఊర్లో చాటింపు వేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని జీవసమాధి అవుతున్నానంటూ గుంటలోకి దిగిన కోటిరెడ్డిని బయటకు తీశారు.
Updated Date - 2025-03-31T12:08:37+05:30 IST