ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ బీసీ ధర్నాలో కవిత వారసుడు

ABN, Publish Date - Oct 18 , 2025 | 11:39 AM

ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతలతో కలిసి ధర్నా చేశారు కవిత. ఖైరతాబాద్‌లో రాస్తారోకో నిర్వహించారు. బీసీ బంద్‌లో కవిత పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీసీ బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈరోజు (శనివారం) ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతలతో కలిసి ధర్నా చేశారు కవిత. ఖైరతాబాద్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఇదిలా ఉండగా... బీసీ బంద్‌లో కవిత పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు.


తల్లితో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారంలో తల్లితో కలిసి పాల్గొన్నారు ఆదిత్య.

Updated Date - Oct 18 , 2025 | 11:48 AM