ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గన్‌తో కాల్పులు.. భయంతో జనం పరుగులు

ABN, First Publish Date - 2025-03-29T16:24:43+05:30

Gunfire In Hyderabad: హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కపూర్‌లో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో వారిని ఆపేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.

హైదరాబాద్, మార్చి 29: నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పులు కలకలం రేపుతోంది. కింగ్స్ ప్యాలెస్‌లోని ఓ ఎక్స్‌పోలో కాల్పులు (Gun Fire) జరిగాయి. ఇద్దరు షాప్ కీపర్ల మధ్య చెలరేగిన వివాదం కాల్పులకు దారి తీసింది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో ఆనం మీర్జా ఎక్స్‌పో జరుగుతోంది. రంజాన్ సందర్భంగా 30 రోజుల పాటు ఈ ఎక్స్‌పోను నిర్వాకులు నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ కీపర్ మధ్య గొడవ చోటు చేసుకుంది.


ఆ గొడవ ఆపేందుకు అసముద్దీన్ అనే వ్యక్తి వచ్చాడు. ఎంతకీ తన మాటవినకపోవడంతో తన వద్ద ఉన్న లైసెస్స్డ్‌ రివాల్వర్‌ను తీసి రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. ఇతరులు అతడిని ఆపే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా కాల్పులు జరిపేందుకు సదరు వ్యక్తి యత్నించాడు. వాళ్లంతా వెంటనే అప్రమత్తమై.. ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఎక్స్‌పో వద్దకు చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ గన్‌ను ఎందుకు తీసుకొచ్చాడు. ఎప్పుడు లైసెన్స్ తీసుకున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.

Earthquake: బాబోయ్.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం..


ఇవి కూడా చదవండి

TDP: తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం

Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-03-29T16:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising