గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం..
ABN, Publish Date - Jun 26 , 2025 | 02:04 PM
Bonalu Festival: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు గురువారం నుంచే ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీ.
Hyderabad: నగరంలో బోనాల సందడి (Bonalu Festival) మొదలైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ విజయశాంతి గోల్కొండ జగదాంబ అమ్మవారికి (Golconda Jagadamba Ammavaru) పట్టు వస్త్రాలు (Pattu Vastralu) సమర్పించనున్నారు. అలాగే బీజేపీ ఎంపీ ఈటల, ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకోనున్నారు. తొలి బోనం గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించనున్నారు. దీనికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతీ గురు, ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News
Updated Date - Jun 26 , 2025 | 09:10 PM