నిండు కుండలా హుస్సేన్ సాగర్..
ABN, Publish Date - Aug 11 , 2025 | 12:15 PM
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు దిగువన నల్గొండలో మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.
హైదరాబాద్: నగరంలో భారీ వర్షాల(Heavy Rains)కు హుస్సేన్ సాగర్ (Hussain Sagar) నిండుకుండలా మారింది. సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు హుస్సేన్ సాగర్‌కి వచ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. మరోవైపు మూసీ(Musi River) పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. దిగువన నల్గొండలో మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ మేరకు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి
Hydra Marshals: హైడ్రా మార్షల్స్ విధులకు బహిష్కరణ.. ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్
Updated Date - Aug 11 , 2025 | 12:16 PM