దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్
ABN, Publish Date - Dec 01 , 2025 | 08:21 PM
దిత్వా తుఫాన్ బలహినపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను మరింతగా బలహనపడి వాయుగుండంగా మారుతోందని వెల్లడించారు.
మూడు రాష్ట్రాలను దడ పుట్టించిన దిత్వా తుపాన్ బలహీనపడింది. అయినప్పటికి రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణను సినిమా హబ్‌గా మార్చే మరో కీలక అడుగు
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? పర్మిషన్ ఉండాల్సిందే..
Updated Date - Dec 01 , 2025 | 08:21 PM