ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Punugulu: వర్షాకాలం.. స్పైసీగా ఇలా పునుగులు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు.!

ABN, Publish Date - Jul 18 , 2025 | 12:57 PM

వర్షాకాలంలో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయట కాకుండా ఇంట్లో ఇలా పునుగులు చేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఓసారి ఇలా ట్రై చేసి తినండి.

Punugulu

వర్షాకాలంలో చాలా మందికి వేడివేడిగా పునుగులు తినాలని ఉంటుంది. అయితే, బయట దొరికే పునుగులు కాకుండా ఇంట్లోనే ఇలా పునుగులు చేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. స్పైసీగా పునుగులను ఎలా చేయాలో?వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

ఇడ్లీ పిండి – 1 కప్పు

మైదా – ¼ కప్పు

ఉప్పు – తగినంత

వంట సోడా – ¼ టీస్పూన్

వెల్లుల్లి కారం లేదా కూరల్లో వేసే కారం – రుచికి తగినంత

నెయ్యి – తగినంత

నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

  • ఒక గిన్నెలో ఇడ్లీ పిండి, మైదా, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపండి.

  • పిండి మృదువుగా ఉండేలా కొద్దిగా నీరు వేసుకుంటూ కనీసం 5 నిమిషాలు కలుపుతూ ఉండండి.

  • ఇలా చేయడం వల్ల పునుగులు గట్టిగా కాకుండా వుంటాయి.

  • తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టండి.

  • ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి తగినంత నూనె వేసి వేడి చేయండి.

  • నూనె వేడి అయ్యేలోగా మిశ్రమాన్ని మరోసారి కలిపి, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని కడాయిలో పునుగులుగా వేయండి.

  • రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ వాటిని వేయించాలి.

  • వేగిన పునుగులను టిష్యూ పై వేయండి, తద్వారా అదనపు నూనె తొలగిపోతుంది.

కారం మిక్స్ చేయడం:

  • వేగిన పునుగులను తీసి ఓ గిన్నెలో పెట్టండి.

  • అందులో ఒక టీ స్పూన్ వెల్లుల్లి కారం (లేదా కూరల్లో వేసే కారం) , ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి.

  • మిగిలిన పునుగులకూ ఇదే విధంగా కారం-నెయ్యి కలపవచ్చు.

  • ఇలా రుచికరమైన, స్పైసీ పునుగులు తయారుచేసుకోండి. చట్నీతో లేదా అలాగే వేడి వేడిగా వీటిని తింటే సూపర్‌గా ఉంటుంది.

చిట్కాలు:

  • ఇడ్లీ పిండికి మైదా కలపడం వల్ల పులియబెట్టే అవసరం తక్కువగా ఉంటుంది.

  • ఇడ్లీ పిండి లేకుంటే, పూర్తిగా మైదాతో కూడా ఈ పునుగులు చేయవచ్చు. కానీ అప్పుడు పిండిని కనీసం 1–2 గంటలు నానబెట్టాలి.

  • నూనెను తగినంత మాత్రమే వేడి చేయండి. ఎక్కువ వేడి చేస్తే పునుగులు బయటనే వేగిపోయి లోపల ముద్దగా ఉంటాయి.

  • రుచిని మెరుగుపరచాలంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వంటివి పిండిలో కలపవచ్చు.

Also Read:

కట్టావి అనే పెసరకట్టు...

ఈ వంటకాలు యమాటేస్ట్ గురూ..

For More Vantakalu

Updated Date - Jul 18 , 2025 | 01:07 PM