Bayya Sanny yadav: నా కుమారుడికి పాకిస్థాన్‌తో సంబంధాల్లేవు
ABN, Publish Date - May 31 , 2025 | 06:03 AM
యూట్యూబర్ బయ్య సన్నీయాదవ్‌కు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవియాదవ్ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి కంటే ముందే సన్నీయాదవ్ దేశానికి వచ్చి different ప్రాంతాల్లో ఉండాడని తెలిపారు.
సన్నీయాదవ్ తండ్రి రవియాదవ్
నూతనకల్, మే 30 (ఆంధ్రజ్యోతి): బైక్‌పై దేశ, విదేశాల్లో తిరుగుతాడే తప్ప తన కుమారుడికి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని యూట్యూబర్ బయ్య సన్నీయాదవ్ తండ్రి రవియాదవ్ చెప్పారు. పాకిస్థాన్‌లో పర్యటించిన నేపథ్యంలో సన్నీయాదవ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారన్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తన కుమారుడు పహల్గాం ఉగ్రదాడి కంటే ముందే మనదేశానికి వచ్చాడని, 10 రోజులు నూతనకల్‌లో ఉండి చెన్నై వెళ్లినట్లు తెలిపారు. వివిధ దేశాలు తిరిగే క్రమంలో పాకిస్థాన్‌కు కూడా వెళ్లాడన్నారు. సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో అసత్యాలు రాసి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఎవరు తీసుకెళ్లారో తమకు ఇంతవరకు తెలియదన్నారు. సన్నీయాదవ్ చెన్నైలో స్నేహితుడి ఇంట్లో ఉంటే తీసుకెళ్లారని, దానికి విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 06:07 AM