ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jurala Project: వేగవంతమైన జూరాల గేట్ల మరమ్మతులు

ABN, Publish Date - May 24 , 2025 | 04:05 AM

జూరాల ప్రాజెక్టులో వరద నీటి వృథా అనే శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది.

  • పనులను పరిశీలించిన ఎస్‌ఈ రహీమొద్దీన్‌

అమరచింత, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘‘జూరాల ప్రాజెక్టులో వరద నీటి వృథా’’ అనే శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. అధికారులు వేగవంతంగా మూడు గేట్ల వద్ద రోప్‌ల మరమ్మతులు చేపట్టారు. మరో రెండు గేట్ల వద్ద పనులను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న గేట్ల మరమ్మతు పనులను ప్రాజెక్టు ఎస్‌ఈ రహీమొద్దీన్‌, డీఈలు, ఏఈల బృందం పరిశీలించింది.


ఇరిగేషన్‌ అధికారులతో పాటు సెక్రటేరియట్‌, ఈఎన్సీ అధికారులు కూడా ప్రాజెక్టు వరద నీటి వృథాపై ఆరా తీసినట్లు తెలిసింది. ఒకవైపు జూరాల గేట్ల వద్ద రోప్‌ మరమ్మతు పనులు కొనసాగుతుండగా మరోవైపు స్టాఫ్‌ లాక్‌ ఎలిమెంట్‌ సెంటర్ల పైనుంచి వరదనీరు వృథాగా దిగువకు పారుతోంది. మూడు రోజులుగా వృథాగా పోతున్న వరద శుక్రవారం కూడా కొనసాగింది.

Updated Date - May 24 , 2025 | 04:05 AM