ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: ఘోర రోడ్డుప్రమాదం.. రెండు ఆటోలపైకి దూసుకెళ్లిన లారీ..

ABN, Publish Date - Jan 26 , 2025 | 12:01 PM

వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మామునూరు వద్ద లారీ అదుపుతప్పి రెండు ఆటోలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

Road Accident

వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) సంభవించింది. మామునూరు (Mamunuru) వద్ద లారీ (Lorry) ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ.. మామునూరు బెటాలియన్ సమీపంలో రాంగ్ రూట్ తీసుకుంది. అనంతరం ముందుకు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తూ ఇనుప రాడ్లు కట్టి ఉంచిన తాడు తెగిపోయింది.


ఈ ప్రమాదంలో లారీ పక్క నుంచి వెళ్తున్న రెండు ఆటోలపై ఐరన్ రాడ్లు పడ్డాయి. దీంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఓ ఆటో డ్రైవర్‌ కాలు విరిగి విలవిలలాడిపోతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇనుప రాడ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bear Attack: రోడ్డుపైకి దూసుకొచ్చిన అడవి మృగం.. అక్కడే ఉన్నవారిని ఏం చేసిందంటే..

Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..

Updated Date - Jan 26 , 2025 | 12:32 PM