Bear Attack: రోడ్డుపైకి దూసుకొచ్చిన అడవి మృగం.. అక్కడే ఉన్నవారిని ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jan 26 , 2025 | 11:42 AM
నంద్యాల: శ్రీశైలం-సున్నిపెంట రోడ్డుమార్గంలో ముగ్గురి యువకులపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై శ్రీశైలానికి బయలుదేరాడు.
నంద్యాల: శ్రీశైలం-సున్నిపెంట రోడ్డుమార్గంలో ముగ్గురి యువకులపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై శ్రీశైలానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో రోడ్డుపైకి ఒక్కసారిగా ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసి యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాహనాన్ని నిలిపివేశారు. యువకులను అప్పటికే గమనించిన భళ్లూకం వారిపైకి ఆగ్రహంగా దూసుకెళ్లింది.
అనంతరం తీవ్రంగా దాడి చేసింది. వారిని గట్టిగా పట్టుకుని గోళ్లు, పళ్లతో గాయపరిచింది. ఈ ఘటనలో ముగ్గురికీ గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర రక్తస్త్రావం కాగా, మరో యువకుడి కంటికి బలమైన దెబ్బలు తగిలాయి. దీంతో అతని కన్ను మూసుకుపోయింది. దాడిని గమనించిన ఇతర వాహనదారులు.. బాధితులను హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను అటవీ శాఖ సిబ్బంది పరామర్శించారు. వారి నుంచి దాడికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు.
కాగా, ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు, చిరుతలు వంటివి జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
RRR: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ.. ఎందుకంటే