ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

G Vivek Venkataswamy: కలలో కూడా ఊహించలేదు

ABN, Publish Date - Jun 09 , 2025 | 03:54 AM

తనకు మంత్రి పదవి వస్తుందని కలలో కూడా ఊహించలేదని నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తన లాంటి సామాన్య కార్యకర్తను కాంగ్రెస్‌ పార్టీ మంత్రిని చేసిందన్నారు. 42 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.

మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు

సామాన్య కార్యకర్తను కాంగ్రెస్‌ పార్టీ మంత్రిని చేసింది

మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది

1982 నుంచి పార్టీలో ఉన్నా.. ఎన్నో కష్టాలు పడ్డా

మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

‘ఆంధ్రజ్యోతి’తో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): తనకు మంత్రి పదవి వస్తుందని కలలో కూడా ఊహించలేదని నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తన లాంటి సామాన్య కార్యకర్తను కాంగ్రెస్‌ పార్టీ మంత్రిని చేసిందన్నారు. 42 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. పేదల కష్టం తెలిసిన వాడినని, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని, కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తానని చెప్పారు. ఆదివారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత లక్ష్మణ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘1982 నుంచి కాంగ్రె్‌సలో ఉన్నా. ఉమ్మ డి ఏపీలో టీడీపీ హవా, రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హవా ఉన్నా.. నేను పార్టీ మారలేదు. సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. గతంలో వరుసగా మూడుసార్లు ఓటమిపాలయ్యాను. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన నాకు.. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చింది. ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ పెద్దలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌, మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు ధన్యవాదాలు. రాజకీయంగా కాంగ్రె్‌సలో నన్ను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, నా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే నాకు ఈ అవకాశం వచ్చింది. నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు’’ అని మంత్రి లక్ష్మణ్‌ అన్నారు.

కాంగ్రెస్‌లోనే సామాజిక న్యాయం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాతే సామాజిక న్యాయం దిశగా అడుగులు పడుతున్నాయని అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళతానని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల మంది ఉన్న మాదిగ జాతికి ప్రతినిధిగా తనకు మంత్రిగా అవకాశం లభించిందని చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ కులాల వర్గీకరణ చేసింది. బీసీలకు 42ు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లులో ఆమోదించాం. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేశాం. ఆ సమయంలో కూడా నాకు మంత్రి పదవి ఇవ్వాలనిగానీ, నాకు ఇస్తారనిగానీ నేను అనుకోలేదు. మా జాతిలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒకరికి ఇవ్వాలని కోరాం. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌ను కలిసినప్పుడూ ఇదే చెప్పాం. కానీ, ఆదివారం ఉదయం 9.15 గంటలకు ముఖ్యమంత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘కాబోయే మంత్రివర్యులకు కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ సీఎం రేవంత్‌ చెప్పారు. సీఎం అలా చెప్పేసరికి నాకు ఒక్కసారిగా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. చాలా సంతోషించా. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, బాగా పనిచేసి.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం సూచించారు. ఆయన సూచనలను కచ్చితంగా పాటిస్తా. నాకు పదవి రావడం పట్ల మిగిలిన మా మాదిగ ఎమ్మెల్యేలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగానే ఉంటాం. ఇక సీఎం రేవంత్‌.. నాకు ఏ శాఖ ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా’’ అని మంత్రి లక్ష్మణ్‌ అన్నారు.

సామాన్య కుటుంబంలో జన్మించి..

లక్ష్మణ్‌ సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చారు. 1966 ఏప్రిల్‌ 1న పెద్దపల్లిలో నాగయ్య, లక్ష్మి దంపతులకు జన్మించిన లక్ష్మణ్‌.. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన భార్య కాంతకుమారి డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు గోదావరిఖని జూనియర్‌ కళాశాల ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడిగా, 1986-94 వరకు ఎన్‌ఎ్‌సయూఐ కరీంనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1996-2001 వరకు ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2006లో ధర్మారం నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో మేడారం నుంచి, 2009, 2010, 2014, 2018లో ధర్మపురి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అంతకుముందు 2009 నుంచి 2011 వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2013-14 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలో ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌గా పనిచేశారు. 2023లో ధర్మపురి నుంచి మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

మీ మేలు మర్చిపోను.. అన్న!

మంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌తో అడ్లూరి కరచాలనం చేస్తూ ‘మీ మేలు ఎప్పుడూ మర్చిపోను.. అన్న!’ అంటూ ధన్యవాదాలు చెప్పారు. అంతకుముందు అడ్లూరికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 03:56 AM