Uttam: ఇంత మంచి పాలన నేనింత వరకు చూడలేదు
ABN, Publish Date - Jan 31 , 2025 | 04:32 AM
‘‘నా 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా... ఇంతకంటే మంచి పాలన నేనింత వరకు చూడలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందేలా చూస్తాం.
పథకాలపై బీఆర్‌ఎ్‌సది తప్పుడు ప్రచారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ మూల సిద్ధాంతం!: సంపత్ కుమార్
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ‘‘నా 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా... ఇంతకంటే మంచి పాలన నేనింత వరకు చూడలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందేలా చూస్తాం. పథకాలపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. అమల్లో ఉన్న పథకాలేవీ ఆగే ప్రసక్తే లేదని, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారంతో ఎవరూ ఆందోళన చెందరాదని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అఽధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కాగా, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ మూల సిద్ధాంతమని, తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కచ్చితంగా చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంద కృష్ణమాదిగ ఎలాంటి ఆందోళన చేయొద్దని సూచించారు. ఈ మేరకు గురువారం సంపత్‌కుమార్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
కమిటీల పేరుతో బీఆర్‌ఎస్ చేసే శవ రాజకీయాలకు రైతాంగం మోసపోయే పరిస్థితిలో లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా ఏకకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల రుణమాఫీ చేసిందన్నారు. తన ప్యాలెస్ నుంచి సీఎం రేవంత్ పాలన చేస్తున్నారనే బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామరామ్మోహన్ రెడ్డి విమర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సీఎం నివాసం నుంచి సమీక్ష చేస్తే తప్పేమిటని ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలను కూల్చి కేసీఆర్ ప్యాలెస్ కట్టుకున్నారని, ప్యాలెస్ సీఎం ఎవరు? అంటే ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు పిలుపునివ్వడం చూసి ప్రజలు నవ్వు కుంటున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందని టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నేసతీశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 31 , 2025 | 04:32 AM