ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: తుమ్మల ఆల్‌ పార్టీ మంత్రి

ABN, Publish Date - Jun 08 , 2025 | 06:27 AM

తుమ్మల నాగేశ్వర్‌రావు ఆల్‌ పార్టీ మంత్రి. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరి ఆయన మంత్రిగా కొనసాగుతారు’’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, టీడీపీ ప్రభుత్వాల్లో కూడా తుమ్మల మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరి మంత్రి అవుతారు

ఈటలపై తుమ్మల విమర్శల నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఎద్దేవా

బనకచర్ల డీపీఆర్‌ను కేంద్రం ఇంకా పరిశీలించలేదని వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై ఏర్పాటైన విచారణ కమిషన్‌ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అబద్ధాలు చెప్పారన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘తుమ్మల నాగేశ్వర్‌రావు ఆల్‌ పార్టీ మంత్రి. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరి ఆయన మంత్రిగా కొనసాగుతారు’’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, టీడీపీ ప్రభుత్వాల్లో కూడా తుమ్మల మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం డీపీఆర్‌ ఇచ్చిందని తెలిపారు. అయితే, దానిని కేంద్రం ఇంకా పరిశీలించలేదని వెల్లడించారు. డీపీఆర్‌ను అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని, ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని, బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు నిలిపివేయాలో పూర్తి వివరాలతో కేంద్ర జలవనరుల శాఖకు నివేదించాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే ఉంటుందని వెల్లడించారు. కాగా, సింగరేణి సంస్థ ఖర్చులు తగ్గించుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం రూ.42వేల కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.1200కోట్లు బకాయి ఉన్నాయని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:27 AM