కూకట్‌పల్లిలో 40.9 డిగ్రీలు!
ABN, Publish Date - Mar 15 , 2025 | 04:35 AM
రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు..
చాలా జిల్లాల్లో 40 డిగ్రీలపైనే నమోదు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీలు నమోదైంది. అలాగే హయత్‌నగర్, మంచిర్యాల జిల్లా కాసిపేటలో 40.7 డిగ్రీలు రికార్డయింది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో 40.6, అదే జిల్లా బేల, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, తిర్యాణి, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 40.4, జగిత్యాల జిల్లా వెల్గటూరు, అయిలాపూర్‌లో 40.3, ఆదిలాబాద్ అర్బన్‌లో 40.2, సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌లో 40.2, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో 40.1, గద్వాల జిల్లా వనపర్తి, మల్దకల్, అయిజల్లో 40 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండు రోజుల పాటు ఎండలు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు 42 డి గ్రీలు దాటే అవకాశముందని వెల్లడించారు.
Updated Date - Mar 15 , 2025 | 04:35 AM