ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana farmer suicide: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:28 AM

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండకు చెందిన రైతు జంగిటి పెంటయ్య (48).. పొలంలో బోరు వేయడంతో పాటు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసం, మొక్కజొన్న పంట వేసేందుకు అప్పులు చేశాడు.

కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు

రాజంపేట, కేశంపేట, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా సరైన దిగుబడి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండకు చెందిన రైతు జంగిటి పెంటయ్య (48).. పొలంలో బోరు వేయడంతో పాటు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసం, మొక్కజొన్న పంట వేసేందుకు అప్పులు చేశాడు. అయితే, పంట దిగుబడి రాకపోవడం, చేసిన అప్పులు రూ.6 లక్షలకు చేరడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎక్లా్‌సఖాన్‌పేటకు చెందిన రైతు ఒట్టెల కుమార్‌(38) వ్యవసాయంతో పాటు నాలుగు పాడి ఆవులను తెచ్చుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆవులు చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 05:28 AM