Tuni Train Fire: తుని రైలు దహనం కేసు తిరగదోడం
ABN, Publish Date - Jun 04 , 2025 | 04:32 AM
తూర్పుగోదావరి తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే కోర్టు తీర్పుపై అప్పీలు వెళ్లబోనని, సున్నితమైన అంశంపై తప్పుగా జారీ అయిన జీవోను రద్దు చేయడంతో వివాదానికి ముగింపు పలికింది. దీనిపై రాజకీయ కలకలం రాకుండా పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ
హైకోర్టులో అప్పీలుకు అనుమతిస్తూ ఇచ్చిన జీవో రద్దు
సర్కారుకు విరుద్ధంగా ఎవరి ఆమోదంతో జీవో ఇచ్చారో తేల్చాలని ఆదేశం
దానిని రద్దుచేస్తూ మరో ఉత్తర్వు జారీ
అమరావతి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా తుని రైలు దహనం కేసులో నెలకొన్న గందరగోళానికి రాష్ట్రప్రభుత్వం తెరదించింది. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో రైల్వే కోర్టు వెలువరించిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఉద్దేశం లేదని, కేసును మళ్లీ తిరగదోడే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) అధికారి ప్రతిపాదనతో అప్పీలుకు వెళ్లాలంటూ సోమవారం హోం శాఖ వెలువరించిన జీవో-852ను ఉపసంహరిస్తూ మంగళవారం నాడు మరో జీవో 869ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వెలువడి గందరగోళానికి కారణమైన అప్పీలు జీవో ఫైలు ఎవరి ఆమోదంతో ముందుకు కదిలిందనే విషయమై సమగ్రంగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రాజకీయ కలకలానికి దారితీసిన ఇటువంటి సున్నితమైన అంశాల్లో అలసత్వానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఏం జరిగింది?
రైల్వే ఆస్తులను సంరక్షించే ఆర్‌పీఎఫ్ విభాగం సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ తుని రైలు దహనం కేసులో కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు ప్రతిపాదన పంపారు. ప్రభుత్వ న్యాయవాది.. ఇతర ప్రతిపాదనల తరహాలోనే హోంశాఖకు పంపడంతో యాంత్రికంగా జీవో జారీ అయింది. సున్నితమైన ఈ కేసులో లోతుగా ఆలోచించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి ఆమోదంతోనే ఉత్తర్వులు జారీచేయాల్సి ఉండగా.. యాం త్రికంగా జీవో జారీచేయడంపై బాధ్యులపై ప్రభు త్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 04:32 AM