ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TS ICET 2025: తొలి రోజు ఐసెట్‌కు 90.49 శాతం మంది హాజరు

ABN, Publish Date - Jun 09 , 2025 | 04:52 AM

మూడు విడతల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు 93 పరీక్ష కేంద్రాల్లో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 91 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.

హైదరాబాద్‌, నల్లగొండ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) ఆధ్వర్యంలో ఆదివారం ఐసెట్‌ను సజావుగా నిర్వహించినట్టు తెలంగాణ ఐసెట్‌-2025 కన్వీనర్‌ ఆచార్య అల్వాల రవి ఓ ప్రకటనలో తెలిపారు. మూడు విడతల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు 93 పరీక్ష కేంద్రాల్లో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 91 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఉదయం పరీక్షకు 24,330 మంది అభ్యర్థులకు 21,897 మంది (90 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 24,330 అభ్యర్థులకు గానూ 22,136 మంది (90.98 శాతం) హాజరయ్యారు. రెండు విడతల్లో కలిపి 90.49 శాతం హాజరు నమోదైంది. ఈ పరీక్షలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఇటికాల పురుషోత్తంతోపాటు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ పరిశీలించారు. యూనివర్సిటీలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి కన్వీనర్‌ రవి పరీక్ష నిర్వహణ సరళిని సమీక్షించి తగు సూచనలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 04:52 AM