ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

School Bus: స్కూల్‌ బస్సులు పదిలమేనా

ABN, Publish Date - Jun 08 , 2025 | 06:22 AM

రాష్ట్రవ్యాప్తంగా 25,677 విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు 17,020 బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నాయి. మిగిలిన 8,657 బస్సులు ఇంకా తీసుకోలేదు. విద్యాసంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి.

రాష్ట్రవ్యాప్తంగా 25,677 బస్సులు.. ఇప్పటి వరకూ ఫిట్‌నెస్‌ జారీ అయినవి 17,020 బస్సులకే

మే 15తో ముగిసిన గడువు.. ఈ నెల 12న స్కూళ్లు పునఃప్రారంభం

ఆలోపు ఫిట్‌నెస్‌ తీసుకోకపోతే బస్సుల్ని సీజ్‌ చేస్తామంటున్న అధికారులు

సర్టిఫికేట్‌ జారీ సమయంలో నిబంధనల్ని పట్టించుకోని కొందరు ఎంవీఐలు

హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం. అయినా ఇప్పటికీ పలు విద్యాసంస్థలు బస్సుల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 25,677 విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు 17,020 బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నాయి. మిగిలిన 8,657 బస్సులు ఇంకా తీసుకోలేదు. విద్యాసంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఏటా మే 15వ తేదీతో బస్సు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల గడువు ముగుస్తుంది. ఆలోపు రెన్యువల్‌ చేసుకోవాలి. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూలు బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేని పక్షంలో అవి రోడ్లపైకి రాకూడదు. కానీ కొన్ని విద్యాసంస్థల యజమాన్యాలు ఇప్పటికీ దరఖాస్తు చేయలేదని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

భద్రత, ప్రమాణాలు ముఖ్యం

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ సమయంలో మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం పలు అంశాలను రవాణా శాఖలోని మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) పరిశీలిస్తారు. సదరు వాహనాలను నడిపే డ్రైవర్ల వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. డ్రైవర్‌ భారీ వాహనాల లైసెన్స్‌ కలిగి ఉండాలి. విద్యార్థులు బస్సు ఎక్కే, దిగే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు సహాయకుడు ఉండాలి. బస్సులో ప్రథమ చికిత్స కిట్‌, అగ్నిమాపక పరికరాలు, సీట్ల మధ్య నిర్ణీతస్థాయిలో ఖాళీ, అత్యవసర మార్గాలు ఉండాలి. వాహనానికి సంబంధించి ఆర్‌సీ, పొల్యూషన్‌, ఇతరత్రా పత్రాలు తప్పనిసరి. వీటితోపాటు వాహనం టైర్లు, బ్రేకులు, ఇంజిన్‌ కండీషన్‌ తదితరాలు పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.


చూసీచూడనట్లు..

నిబంధనల ప్రకారం వాహనం ఉందా? లేదా? అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. కొందరు మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు నిబంధనల్ని గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సులో ప్రాథమిక చికత్స, అగ్నిమాపక కిట్‌ వంటివి ఉన్నాయా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. బ్రేకులు, ఇంజిన్‌ కండీషన్‌లో లోపాలున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో పాఠశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఎక్కువ. వీటికి సంబంధించి 13 వేలకుపైగా బస్సులు ఉండగా.. ఇప్పటి వరకు 10 వేల బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఇవన్నీ ప్రమాణాల ప్రకారం ఉన్నవేనా అంటే ఔనని అధికారులూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కొన్ని విద్యాసంస్థల్లో 15 ఏళ్లు దాటిన వాహనాలూ యథేచ్ఛగా రోడ్ల మీద నడుస్తుండటం గమనార్హం.

ఫిట్‌నెస్‌ లేని వాహనాలు సీజ్‌

రాష్ట్రవ్యాప్తంగా 25,677 విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు 17,020 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నాయి. మిగిలిన 8,657 బస్సులు విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యేలోగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తాం. 15 ఏళ్లు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగరాదు. ఫిట్‌నెస్‌ లేని బస్సుల్లో విద్యార్థుల్ని తీసుకెళ్తే ఆ వాహనాల్ని సీజ్‌ చేయడంతోపాటు యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. యాజమాన్యాలు వాహనాల్ని మంచి కండీషన్‌లో ఉంచడంతోపాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలి. 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కాగానే తనిఖీలు ప్రారంభించాలని రవాణా శాఖ కార్యాలయాల అధికారులను ఆదేశించాం.

- విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:22 AM