ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TIMS Hospitals: ప్రాజెక్టు గడువులోగా పూర్తికాకపోతేసర్కారు ఆమోదం పొందాకే అనుమతులు

ABN, Publish Date - May 28 , 2025 | 07:45 AM

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మూడు టిమ్స్‌ ఆస్పత్రుల భవనాల నిర్మాణం గడువు లోగా పూర్తికాకపోవడంతో, ప్రాజెక్టులకు గడువు పొడిగింపునకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులు జూన్‌ 2 నుండి ఆస్పత్రులను విడతల వారీగా ప్రారంభించే సమయాన్ని ప్రకటించినప్పటికీ, పెండింగ్ పనుల కారణంగా ప్రాజెక్టుల పూర్తి నిర్ధారణ కోసం ఆమోదం అవసరం.

  • 3 టిమ్స్‌ ఆస్పత్రుల భవనాల నిర్మాణాల్లో జాప్యం వల్లే నిర్ణయం

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు భవనాలశాఖలో ఇటీవల ఓ అకస్మాత్తు నిర్ణయం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది బహిర్గతమైంది. హైదరాబాద్‌ పరిధిలో నిర్మిస్తున్న మూడు టిమ్స్‌ ఆస్పత్రుల భవనాల నిర్మాణ పనుల్లో జాప్యం, వాటి ప్రారంభోత్సవ తేదీలు మారడమే ఇందుకు కారణమని తేలింది. కొత్తగా చేపట్టనున్న, పాత ప్రాజెక్టులు నిర్దేశిత సమయంలో పూర్తికాకపోతే.. వాటికి సర్కారు ఆమోదం పొందాకే గడువు పొడిగింపునకు అవకాశం కల్పించాలని ఆర్‌అండ్‌బీలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే సమయానికి పూర్తి కాని ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించి, ఆ ఫైళ్లను ప్రభుత్వం పరిశీలించి, ఆమోదించాకే గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు శాఖలో ఓ సర్క్యులర్‌ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, అల్వాల్‌, సనత్‌నగర్‌లో తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రులను నిర్మిస్తోంది. దాదాపు పనులు చివరి దశకు రావడంతో ఆర్‌అండ్‌బీ, వైద్యారోగ్య శాఖల మంత్రులు ఆయా నిర్మాణాలను పరిశీలించి జూన్‌ 2 నుంచి విడతల వారీగా టిమ్స్‌ను ప్రారంభిస్తామంటూ పలు వేదికల ద్వారా చెప్పారు. నిర్మాణ పరంగా 85-90ు పనులు పూర్తయినప్పటికీ.. మిగిలిన పలు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ క్రమంలోనే నిర్దేశిత సమయానికి పూర్తికాని ప్రాజెక్టులకు గడువు పొడిగింపునకు సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వానికి పంపి, సర్కారు ఆమోదం తర్వాతే గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - May 28 , 2025 | 07:46 AM