ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thummala Nagender Rao: ఎరువుల సరఫరాపై కేంద్రానికి తుమ్మల లేఖ

ABN, Publish Date - Jul 27 , 2025 | 03:58 AM

తెలంగాణకు రావాల్సిన ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు.

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు రావాల్సిన ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు త్వరితగతిన పంపించాల్సిందిగా కోరారు. ఆగస్టు నెలవారీ కేటాయింపులతోపాటు ఇప్పటి వరకు ఏర్పడ్డ 1.93 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు, జూలైలో ఇంకా సరఫరా కావాల్సిన 0.44 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువుల్ని ఆగస్టు నెల కేటాయింపులతో కలిపి సరఫరా చేయాల్సిందిగా కోరారు.

ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వార్షిక కేటాయింపుల్లో భాగంగా 2025 ఖరీఫ్‌ సీజన్‌కు 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించిందన్నారు. కేటాయించిన మొత్తం నెలవారి ప్రణాళికప్రకారం రాష్ట్రానికి పంపిణీ చేయా ల్సి ఉండగా.. తక్కువే సరఫరా చేసిందని అధికారులు మంత్రికి వివరించారు.

Updated Date - Jul 27 , 2025 | 03:58 AM