ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Greenfield Road: గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులు వేగవంతం

ABN, Publish Date - Jan 02 , 2025 | 04:07 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఫోర్త్‌ సిటీని కలుపుతూ నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులను సర్కారు వేగవంతం చేసింది. విమర్శలకు తావు లేకుండా, ఎక్కడా వంకరలు లేకుండా ఈ రహదారి నిర్మాణం చేపడుతోంది.

  • విమర్శలకు తావు లేకుండా నిర్మాణం..ఇప్పటికే రెండో విడత నోటిఫికేషన్‌

  • 60 రోజుల వరకు అభ్యంతరాల స్వీకరణ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఫోర్త్‌ సిటీని కలుపుతూ నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులను సర్కారు వేగవంతం చేసింది. విమర్శలకు తావు లేకుండా, ఎక్కడా వంకరలు లేకుండా ఈ రహదారి నిర్మాణం చేపడుతోంది. తొలి విడత 20 కి.మీ. కోసం 449 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసి హద్దులు కూడా నిర్ణయించింది. ఇక రెండో విడత 21.5 కి.మీ. కోసం554.35 ఎకరాల భూసేకరణకు మంగళవారమే నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి రావిర్యాలలోని ఔటర్‌ రింగురోడ్డు ఎగ్జిట్‌ 13 నుంచి ఆమన్‌గల్‌లోని ఆకుతోటపల్లి వద్ద రీజినల్‌ రింగురోడ్డుకు అనుసంధానం కానుంది.


రెండో విడత కింద ఆమన్‌గల్‌ మండలం ఆమన్‌గల్‌లో 68.80 ఎకరాలు, ఆకుతోటపల్లిలో 83.35, యాచారం మండలంలోని కుర్మిద్ధ 144.75, కడ్తాల్‌ మండలం కడ్తాల్‌లో 72.67, ముద్విన్‌లో 184.76 ఎకరాలు సేకరిస్తున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న భూయజమానులు భూమిలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని సర్కారు ఆదేశించింది. భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా హేతుబద్ధమైన పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది. భూసేకరణపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది.

Updated Date - Jan 02 , 2025 | 04:07 AM