ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telecom Department: టెలికాం శాఖ నుంచి ‘విపత్తు’ సందేశాలు

ABN, Publish Date - Jul 17 , 2025 | 04:30 AM

విపత్తుల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా టెలికాం శాఖ(డీవోటీ) రెండు వారాల నుంచి సందేశాల(అలర్ట్‌)ను పంపుతోంది.

  • కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్న టెలికాం శాఖ

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : విపత్తుల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా టెలికాం శాఖ(డీవోటీ) రెండు వారాల నుంచి సందేశాల(అలర్ట్‌)ను పంపుతోంది. గతంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా సందేశాలు వచ్చేవి. తాజాగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన టెలికాం శాఖ విపత్తుల నిర్వహణ సంస్థతో అనుసంధానమై అత్యవసర సమయాల్లో దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూసందేశాలను పంపే ఏర్పాట్లు చేసింది.

దీన్ని పరీక్షించే చర్యల్లో భాగంగా నాలుగు వారాల పాటు ఈ అలర్ట్‌ సందేశాలను సెల్‌ఫోన్‌ వినియోగదారులందరికీ పంపనుంది. మొత్తం 36రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 19 భాషల్లో ఈ టెక్స్ట్‌ సందేశాలు పంపుతున్నారు. వాటిపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీవోటీ అధికారులు తెలిపారు. అప్రమత్తత(అలర్ట్‌) సందేశాలు గత రెండు వారాలుగా వస్తున్నాయి. మరో రెండు వారాల పాటు ఇవి కొనసాగే అవకాశం ఉంది.

Updated Date - Jul 17 , 2025 | 04:30 AM