ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ:సీతక్క

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:46 AM

అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించడానికి త్వరలో 14 వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించడానికి త్వరలో 14 వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకమైన సరకులు సరఫరా చేస్తే ఆ సరఫరా దారులను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి, చిన్నారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేఽధోమథన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.


అంగన్‌వాడీ లబ్ధిదారులకు అందిస్తున్న కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులకు అందించే ఆహారాన్ని మరింత రుచికరంగా మారుస్తామని, వారంలో ఒకటీరెండు సార్లు ఎగ్‌ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని ప్రకటించారు. చిన్నారుల ప్రవేశాలను పెంచడానికి ‘అమ్మమాట.. అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె సూచించారు.

Updated Date - Jun 05 , 2025 | 02:46 AM