ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ

ABN, Publish Date - Jun 02 , 2025 | 03:57 AM

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

  • నేడు 40వేల మంది రైతులకు విత్తన కిట్లు: తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘‘గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణి’’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని 11వేల గ్రామాల్లో.. 40 వేల మంది రైతులకు విత్తన కిట్లు అందించనున్నట్టు వెల్లడించారు.


జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు ఐదు ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మినుము, జొన్న) నాణ్యమైన విత్తనాల కిట్లను అందిస్తారని పేర్కొన్నారు. ఎంపిక చేసిన మిగతా అభ్యుదయ రైతులకు జూన్‌ 3న ఆయా గ్రామల్లో స్థానిక వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో విత్తన కిట్లను పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 03:57 AM