International Yoga Day: 20న ఎల్బీ స్టేడియంలో యోగా వేడుకలు
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:57 AM
యోగా వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. 20న ఉదయం 5 గంటలకు నిర్వహించే వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండిన సందర్భంగా యువతకు అవగాహన కార్యక్రమాలు: కిషన్‌రెడ్డి
బర్కత్‌పుర, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): యోగా ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యెగా దినోత్సవంగా ప్రకటించి పదేళ్లు నిండుతున్న సందర్భంగా ఈ నెల 20న ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. యోగా వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. 20న ఉదయం 5 గంటలకు నిర్వహించే వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో యోగా వేడుకల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి 50 ఏళ్లు నిండుతున్న సందర్భంగా నాటి చీకటి రోజుల వాస్తవాలను, ప్రజలు పడిన ఇబ్బందులను నేటి యువతకు తెలియజేయడానికి విస్తృతంగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన జాతీయ వాదులను ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసి జైల్లో పెట్టిందని, ఆ చీకటి రోజులను ప్రజలు నేటికీ మరచిపోలేదని చెప్పారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు నిండుతున్న సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నేడు కాచిగూడ స్టేషన్‌లో ఫసాడ్ లైటింగ్ ప్రారంభం
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దాదాపు రూ.2.23 కోట్లతో ఏర్పాటు చేసిన ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను సోమవారం సాయంత్రం 6 గంటలకు కిషన్‌రెడ్డి జాతికి అంకితం చేస్తారని స్టేషన్ డైరెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 785 లైట్లతో స్టేషన్ సముదాయం చూడముచ్చట గొలుపుతుందని చెప్పారు. స్టేషన్ ప్రారంభమై 109 ఏళ్లు పూర్తయ్యాయని బాలాజీ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 04:57 AM