ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gurukulam: ‘సంక్షేమం’ నిధుల్లో గోల్‌మాల్‌!

ABN, Publish Date - May 30 , 2025 | 04:39 AM

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్)లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కోట్లలో అవకతవకలకు పాల్పడినట్లు రాష్ట్ర అకౌంట్స్‌ విభాగం నివేదిక పేర్కొంది.

  • సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో 2017 నుంచి 2020 మధ్య అక్రమాలు

  • నివేదిక సమర్పించిన అకౌంట్స్‌ విభాగం.. తదుపరి విచారణకు విజిలెన్స్‌ విభాగానికి ప్రతిపాదన

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్)లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కోట్లలో అవకతవకలకు పాల్పడినట్లు రాష్ట్ర అకౌంట్స్‌ విభాగం నివేదిక పేర్కొంది. రెండ్రోజుల క్రితం అందిన ఈ నివేదికపై గురుకులాల సొసైటీ ప్రస్తుత కార్యదర్శి అలుగు వర్షిణి తదుపరి విచారణ కోసం విజిలెన్స్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ అక్రమాల గురించి అకౌంట్స్‌ విభాగం పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రభుత్వానికి గురువారం ఆమె ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎ్‌సలో 2017-20 మధ్యకాలంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై అందులో ప్రస్తావించినట్లు సమాచారం. విజిలెన్స్‌ దర్యాప్తు తర్వాతే అక్రమార్కులపై చర్యలు తీసుకోనున్నారు. కాగా అకౌంట్స్‌ విభాగం సమర్పించిన నివేదిక ప్రకారం రూ.4కోట్ల వార్షిక వ్యయంతో చేపట్టిన కోడింగ్‌ స్కూళ్ల ప్రాజెక్టులో పనులు లేకుండానే రూ.92లక్షలు ఎక్కువగా చెల్లించారని, స్థలాలు, స్కూళ్ల సంఖ్య వివరించకుండా ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.


ఈ-ప్రొక్యూర్మెంట్‌ ద్వారా టెండర్లు చేపట్టలేదని, విద్యార్థుల సంఖ్య, సిబ్బంది అర్హతల వంటి కీలక నిబంధనలను పట్టించుకోలేదని.. బ్యాంక్‌ గ్యారంటీ లేకుండానే 90శాతం ముందస్తు చెల్లింపు చేశారని, ఇది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. లైసెన్సుల వినియోగంపై ఎటువంటి డేటాలేకుండా, ఏజెన్సీకి రూ.2.03 కోట్లు చెల్లించారని, డెలివరీ ధ్రువీకరణకు ముందే బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఒప్పంద ఉల్లంఘన జరిగిందని తెలిపారు. రైట్స్‌ లిమిటెడ్‌ పరిశీలనలో యూనిఫామ్‌లకు నాణ్యతలేదని తిరస్కరించినా.. టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ రూ.9.33 కోట్లకు వాటిని కొనుగోలుచేసి విద్యార్థులకు అందించినట్లు గుర్తించింది. వారంటీ లేని విద్యుత్తు సామగ్రిని రూ.1.38కోట్లకు కొనుగోలు చేశారని.. డైట్‌, క్లీనింగ్‌, పరీక్ష ఫీజుల కోసం సరైన ఒప్పందాలు లేకుండా చెల్లింపులు జరిపారని, పలు బిల్లులు గల్లంతయ్యాయని, లెడ్జర్‌ బుక్కుల్లో చాలా తేడాలు ఉన్నట్లు అకౌంట్స్‌ విభాగం తన నివేదికలో పేర్కొంది.


అంగన్‌వాడీలకు తీపి కబురు

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ ప్రయోజనాల పెంపునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉద్యోగ విరమణపొందే అంగన్‌వాడీ టీచర్లకు ఇకనుంచి రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చెల్లించే విధంగా త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Updated Date - May 30 , 2025 | 04:39 AM