ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు

ABN, Publish Date - May 20 , 2025 | 05:40 AM

తెలంగాణ అగ్నిమాపక శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నాన్‌ హై రైజ్‌ బిల్డింగ్స్‌కు కూడా అగ్నిమాపక అనుమతి తప్పనిసరిగా చేయాలని చట్ట సవరణను శాఖ కోరుతోంది.

ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదన

ఆమోదిస్తే వచ్చే నియామకాల నుంచే అమలు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖలో మహిళా సిబ్బంది నియామకానికి కసరత్తు ప్రారంభమైంది. పోలీస్‌ నియామకాల మాదిరిగానే అగ్నిమాపక శాఖ పోస్టుల భర్తీలోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం లభిస్తే... వచ్చే నోటిఫికేషన్‌ నుంచి అగ్నిమాపక శాఖ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమల్లోకి రానుంది. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వర్తించాలంటే శారీరక దృఢత్వంతోపాటు కఠినమైన ఫిట్‌నెస్‌ పరీక్షలు పాస్‌ కావాలి.. దీన్ని దృష్టిలో పెట్టుకొని అగ్నిమాపక శాఖలో మహిళా సిబ్బందిని నియమించడం లేదు. అయితే ఇతర దేశాలు, రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు.. ఫైర్‌ఫైటర్లుగా మహిళలకూ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు తమిళనాడు, మహారాష్ట్రల్లోని అగ్నిమాపక శాఖల్లో మాత్రమే మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ముంబై అగ్నిమాపక శాఖలో మహిళా సిబ్బంది నియామకం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019లో తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా నియామక ప్రక్రియ చేపట్టగా.. వందలాది మంది శిక్షణ పొంది అగ్నిమాపక శాఖలో చేరారు. ఆ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని అధ్యయనం చేసిన తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు.. ఇక్కడ కూడా మహిళా సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ‘‘అగ్నిమాపక శాఖలో మహిళా సిబ్బంది నియామకానికి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం అనుమతిస్తే రాష్ట్రంలోనూ మహిళలకు రిజర్వేషన్‌ కల్పించి, నియామకాలు చేపడతాం’’ అని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.


వారూ అనుమతి పొందాల్సిందే...

మహిళా సిబ్బంది నియామకంతోపాటు మరికొన్ని ప్రతిపాదనలను అగ్నిమాపక శాఖ ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం హై రైజ్‌ బిల్డింగ్స్‌కు మాత్రమే అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి కాగా.. ఇకపై నాన్‌ హై రైజ్‌ బిల్డింగ్‌లో నిర్వహించే వ్యాపార సంస్థలకూ దీన్ని వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న చిన్న గోదాంలు, పరిశ్రమలు, ఫర్నిచర్‌ తయారీ యూనిట్లు నాన్‌ హైరైజ్‌ బిల్డింగ్స్‌లో ఉన్నా అగ్నిమాపక శాఖ అనుమతి పొందేలా చట్ట సవరణ చేయాలని కోరింది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:40 AM