ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేపాల్‌లో తెలంగాణ పర్వతారోహకుడి మృతి

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:42 AM

ఈబీసీ నుంచి తిరుగు ప్రయాణంలో కఠ్మాండు చేరుకున్న తర్వాత గుండెపోటుకు గురై మృతి చెందాడు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాఘవేంద్ర కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.

భువనగిరి టౌన్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ (ఈబీసీ) ట్రెక్కింగ్‌కు వెళ్లిన తెలంగాణ పర్వతారోహకుడు బలమూరు రాఘవేంద్ర అలియాస్‌ రాకేష్‌ (34) నేపాల్‌ రాజధాని కఠ్మాండులో శుక్రవారం మరణించాడు. ఈబీసీ నుంచి తిరుగు ప్రయాణంలో కఠ్మాండు చేరుకున్న తర్వాత గుండెపోటుకు గురై మృతి చెందాడు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాఘవేంద్ర కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. భువనగిరి కేంద్రంగా పర్వతారోహణ రంగంలో పనిచేస్తున్న ట్రాన్సెండ్‌ అకాడమీ ఆఫ్‌ రాక్‌ క్లైంబింగ్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 20 మందితో కలిసి 18 రోజుల క్రితం ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంపు యాత్ర పూర్తి చేసుకుని బృందంతో కలిసి తిరుగు ప్రయాణమైన రాఘవేంద్ర కఠ్మాండు చేరుకున్న కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 05:42 AM