Telangana Government: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావుకు రక్షణను రద్దు చేయండి
ABN, Publish Date - Apr 29 , 2025 | 03:29 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో శ్రవణ్ పాత్రపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి
సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వినతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఒక మీడియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరువేల శ్రవణ్ కుమార్‌రావుకు గతంలో కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎ్‌సలతోపాటు కొందరు న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనే ఫిర్యాదులున్నాయి. ఆ వ్యవహారంలో శ్రవణ్ కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను మార్చి 2న న్యాయస్థానం తిరస్కరించింది.
హైకోర్టు తీర్పును మార్చి 3న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్‌లో కోరింది. శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ ఆయన విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను మే 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు శ్రవణ్ రావుకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్
Updated Date - Apr 29 , 2025 | 03:29 AM