ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Government: ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

ABN, Publish Date - Apr 30 , 2025 | 03:48 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది

  • హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ‘పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న నిందితుడు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరడం సరికాదు. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు


. ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి వినియోగించారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తేవాలంటే ప్రభాకర్‌రావు కస్టడీ కీలకం.. ఆయన నిర్బంధ విచారణ వల్లే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రభాకర్‌రావును భారత్‌ తీసుకురావడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. పాస్‌పోర్ట్‌ పునరుద్ధరణకు ఎలాంటి ప్రయత్నంచేయని నిందితుడు.. అమెరికాలో కూర్చుని హైకోర్టు ఆదేశాలు పొందాలని చూస్తున్నాడు. అరెస్ట్‌ చేయొద్దన్న ఆదేశాలు పొందిన తర్వాతే భారత్‌ వస్తాననే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాడు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు బయటకు పొక్కిన తర్వాత క్యాన్సర్‌ ఉందని తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు’ అని ఆరోపించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Updated Date - Apr 30 , 2025 | 03:48 AM